Sunday, January 18, 2009

ప్రారంభం

గడిచిన వారం పారిస్ నగరంలో ఐక్యరాజ్య విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక సమితి (యునెస్కో) వారు జరిపిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ సంవత్సరాన్ని (౨౦౦౯) అంతర్జాతీయ ఖగోళశాస్త్రాబ్దిగా ప్రకటించారు. నాలుగు శతాబ్దాల క్రితం ఇటలీ శాస్త్రవేత్త గెలీలియో తన దుర్భిణిని మొదటిసారి ఖగోళంపై సారించి, బృహస్పతి ఉపగ్రహాలని గ్రహించాడు. అదే సంవత్సరం, గ్రహాలు దీర్ఘవృత్త కక్ష్యలలో పరిభ్రమిస్తాయని తెలియజేసిన కెప్లర్ ఉద్గ్రంథం ఆస్ట్రానోమియా నోవా వెలువడింది. ఈ చారిత్రిక ఘట్టాలని పురస్కరిస్తూ, నాలుగు శతాబ్దాల శాస్త్రాభివృద్ధికి పట్టం కడుతూ, ప్రపంచమంతటా ఖగోళోత్సవాలు జరుపుకునేందుకు సంసిద్ధమౌతున్నారు.

ఈ సంబరాలని తెలియజేస్తున్న ఆంగ్ల విజ్ఞాన పత్రికా వ్యాసాలలోని విషయాలని ఈ వేదిక మీద తెలుగులో పంచుకుందాం!